Goods train | తెగిన బోగీల లింక్…

Goods train | తెగిన బోగీల లింక్…

2కిలోమీటర్ల మేరకు ముందుకెళ్లిన గూడ్స్ ఇంజిన్


Goods train | రాయదుర్గం పట్టణం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో గూడ్స్ రైలు (Goods train) బోగీలు విడిపోయిన ఘటన రైల్వే భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ముడి ఇనుప ఖనిజం లోడుతో కర్ణాటకలోని తోరణగల్లు జిందాల్ పరిశ్రమకు వెళ్తున్న రైలులో లింక్ తెగిపోవడంతో (Link broken) బోగీలు విడిపోయి, ఇంజిన్ ఒంటరిగా 2 కి.మీ మేరకు ముందుకు వెళ్లిపోయింది.

రైల్వే సిబ్బంది (Railway staff) అప్రమత్తతతో రైలును నిలిపి, రెండు గంటల శ్రమతో బోగీలను మళ్లీ అనుసంధానం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రైల్వే ట్రాక్ పరిస్థితి, సాంకేతిక లోపాలపై ఆందోళన కలిగించింది.

Leave a Reply