జీవో 69 గుడ్ న్యూస్‌..

జీవో 69 గుడ్ న్యూస్‌..


ఊట్కూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మండ‌ల కేంద్రంలోని రైతు(Farmer) నివేదిక‌లో పున‌రావ‌సం, పున‌రాశ్ర‌యం గ్రామ స‌భ‌ను నిర్వ‌హించారు. నారాయ‌ణ‌పేట కొడంగ‌ల్(Kodangal) ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో భూములు కోల్పోతున్న రైతుల‌కు 14 ల‌క్ష‌ల ప‌రిహారం త‌క్కువ అవుతుంద‌ని, కొ్ద్ది రోజులుగా ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేశారు.

జీవో 69 ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల‌కు రూ.20 ల‌క్ష‌లు(Rs. 20 lakhs) ఇవ్వాల‌ని ప్ర‌భ‌త్వం నిర్ణ‌యించిన‌ట్లు ఈ గ్రామ స‌భ‌లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ క‌లెక్ట‌ర్ శ్రీ‌నివాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

స‌మ్మ‌తి ప‌త్రాల‌తో పాటు పాస్‌బుక్‌, బ్యాంక్ అకౌంట్‌, ఆధార్ కార్డుతో ప‌త్రాలు స్థానిక త‌హ‌సీల్దార్(Tahsildar) కార్యాయ‌లంలో ఇవ్వాల‌ని తెలియ‌జేశారు. దీంతో అక్క‌డ ఉన్న రైతులు ఆనందం వ్య‌త్తం చేశారు. గ‌తంలో 14 ల‌క్ష‌లు ప‌రిహారం పొందిన రైతుల‌కు సైతం 20 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

పూర్తిగా భూములు(lands) కోల్పోతున్న రైతులు పున‌రావాసం కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలియ‌జేశారు. ఆర్డీవో రామ‌చంద్ర‌నాయ‌క్‌, త‌హ‌సీల్దార్ ర‌వి, ఎంపీడీవో ద‌నంజ‌య్ గౌడ్ త‌దిత‌ర అధికారులు, నాయ‌కులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply