Good News | బ‌డ్జెట్‌లో రైతుల‌కు ప్రోత్సాహం

Good News | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ వ్యాప్త రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 2026-27కు సంబంధించిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్ లో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

దీంతో పాటు తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, కొబ్బరి రైతుల కోసం కొత్త పథకం, కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు, కోకో ఉత్పత్తికి చర్యలు, గంధం చెట్ల వనాలు, ఆల్మండ్స్, పైన్ నట్స్ కోసం ప్రత్యేక పథకంతో పాటు మహిళల ద్వారా ప్రత్యే షీ బజార్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయబోతోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

దీని వల్ల ఏపీకి భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కొబ్బరి తోటలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్త బాధిత రైతులకు ఉపశమనం కలిగించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు

Leave a Reply