నివాళులర్పించిన గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణ బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ బాబా మాతృమూర్తి శనివారం ఆనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతి వ్యక్తం చేశారు.
