Golla Kiran | సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు సన్మానం

Golla Kiran | సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు సన్మానం

Golla Kiran | రెంజల్, ఆంధ్రప్రభ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన గొల్ల కిరణ్ ఇటీవలే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించిన గ్రామ యువకుడిని ఇవాళ‌ గ్రామ ఉపసర్పంచ్ శీలం మానస రాకేష్ రెడ్డి సన్మానించారు. శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ… సామాన్య కుటుంబంలో పుట్టి, రాత్రింబవళ్లు చదివి, చివరకు కష్టాలను ఎదుర్కొని, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన గొల్ల కిరణ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకువస్తాడని మనసారా కోరుకుంటున్నాన‌న్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కృష్ణవేణి, ఇస్తిరి పద్మ పోశెట్టి, సంతోష్ రమ్య, రాజు, శ్రీను, తదితరులు ఉన్నారు.

Leave a Reply