పసిడి తారా జువ్వ తళతళ
- గోల్డ్ ధమాకా ఆల్ టైమ్ రికార్డు
- రూ.1.25 లక్షల చేరువలో పసిడి ధర
వెబ్ బిజినెస్ డెస్క్, ఆంధ్రప్రభ : దీపావళి ధమాకా రీతిలో బంగారం(gold) ధర ఆకాశంలో పేలుతోంది. వరుసగా నాలుగో రోజు (8.10.2025న) కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ఇక బంగారం కొనటం అసాధ్యమని బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad)లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు(all-time record) స్థాపించింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,020ల నుంచి ధర రూ.1,23,930లకు అంటే రూ.1,910లు పెరిగింది. 22 క్యారెట్ల(carats) 10 గ్రాముల బంగారం రూ.1,11,850 లు నుంచి రూ. 1,13,600 చేరింది. అంటే రూ.1,750లు పెరిగింది.
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,520ల నుంచి రూ.92.950లకు అంటే రూ.1.450లు పెరిగింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,53,501 పలికింది. హైదరాబాద్ ఆల్ టైమ్ రికార్డు చేరింది. మరి కొన్నిగంటల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,25,000 దాటిపోతుందని బులియన్ మార్కెట్ అంచనా. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అమెరికా(America) వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలతో బంగారం ధరలు భారీగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మదుపర్ల వైఖరి మారింది. షేర్ మార్కెట్(stock market) స్థితి, గతిని అంచనా వేయలేక పోతున్నారు.
బంగారం ధర పెరుగుతుందే గానీ.. తగ్గదు. మహా బంగారం తరుగుదలే కాస్త ఇబ్బంది. అదీ మూల పెట్టుబడికి ఏమాత్రం నష్టం రాదు. ఈ స్థితిలో గోల్డ్ ఈజ్ సేఫ్టీ జోన్(Gold is Safety Zone)గా మదుపర్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ స్థితిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు సీజన్ మొదలైంది. చాలా మంది వినియోగదారులు ధరలు కొంత తగ్గుతాయని ఆశించగా..ఈ పెరుగుదల ఆభరణాల కొనుగోలుదారుల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది.
గడచిన నాలుగు రోజుల్లో .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయలు తక్కువ 6000లకు (రూ.5,930లు), 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,400 లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.4,450లు పెరిగింది. ఈ స్థితిలో ఇక బంగారం ధర తగ్గదు. కనీసం నల్లపూస దండ కూడా కొనలేమని బంగారం ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం ధర తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) 4000 డాలర్లు దాటింది. ఈరోజు 4014 డాలర్ల(Dollars) వద్ద బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. డాలర్ బలహీనత, అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అస్థిరత, అనిశ్చితి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తో బంగారమే సురక్షిత పెట్టుబడిగా మదుపర్లు ముద్ర వేస్తున్నారు.
బంగారం ధర సరికొత్త రికార్డును స్థాపించింది. బంగారం ధర ఈ ఏడాది దాదాపు 50 శాతం పెరిగింది. అమెరికన్ డాలర్ పది శాతం తగ్గింది. డాలర్ బలహీనత అనేది బంగారాన్ని భారీగా పెంచుతుంది. మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించటానికి ఇది ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా పలు దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు, రిటైల్ ఇన్వెస్టర్లు(Retail Investors) బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో బంగారం ధర భారీగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లు బదులుగా బంగారం వైపు పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఎక్కువగామొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు సెప్టెంబర్ లో ఫెడరల్ రిజర్వ్(Federal Reserve) వడ్డీ రేట్లు తగ్గించడంతోపాటు భవిష్యత్తులో మరింత తగ్గించే అవకాశం ఉందనే వార్తలు రావడంతో బంగారం ధర భారీగా పెరిగింది అని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
ప్రముఖ ఇన్వెస్టర్ Ray Dalio, Bridgewater Associates స్థాపకుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పోర్టుఫోలియో(Portfolio)లో 15% బంగారంలో పెట్టుబడి పెట్టాలని సూచన చేశారు. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజాగా బంగారం ధర 4000 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని జాగ్రత్తగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లను సూచించింది
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
వరంగల్ రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
విజయవాడ రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
గుంటూరు రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
విశాఖపట్నం రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
చెన్నై రూ.1,22,780లు రూ.10,950లు రూ.92,750లు
కోల్కత్త రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
ముంబై రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
ఢిల్లీ రూ.1,22,070లు రూ.1,12,000 లు రూ.91,670లు
బెంగళూరు రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
కేరళ రూ.1,22,020లు రూ.1,11,850 లు రూ.91,520లు
అహ్మదబాద్ రూ.1,22,07 0లు రూ.1,11,900లు రూ.91,520లు
వడోదర రూ.1,22,07 0లు రూ.1,11,900లు రూ.91,520లు