సింగరాయకొండలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు
సింగరాయకొండ అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): పట్టణాలు, పల్లె సీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, పట్టణాలు, పల్లె సీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం నెలకొక థీమ్ తో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటిని, వార్డును, గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్ద నగరాల్లో చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయడం, వాడిన నీటిని రీసైక్లింగ్ చేసి పరిశ్రమలకు వినియోగించడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ నెల స్వచ్ఛమైన గాలిని పెంపొందించడం అనే థీమ్ తో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సింగరాయకొండలోని ప్రధాన రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని , త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే చేపల మార్కెట్ ను నవీకరించేలా, రైతు బజారు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో సింగరాయకొండలో అన్నాక్యాంటీన్ ను కూడా ప్రారంభించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. పేదల సంక్షేమం, అభివృధ్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డీపీఓ వెంకటేశ్వర రావు, సింగరాయకొండ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య సింగరాయకొండ ప్రధాన కార్యదర్శి ముల్లపూడి సత్యసందా నీ భాష కానపరెడ్డి సుబ్బారావు సుదర్శన్ చంటి గిరి గుదే వెంకటేశ్వర్లుసన్నీపోయిన వెంకటేశ్వర్లు ఎస్ మల్లికార్జున్ అంబటి శ్రీను చిలం సంటి సింగరాయకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు రాజేష్ కనపర్తి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


