Gold Rate | ఒక్కరోజులోనే..

Gold Rate | ఒక్కరోజులోనే..
- ఇవాళ తులం బంగారం పై రూ.9,050 తగ్గింపు
- ఇంకా తగ్గే అవకాశాలున్నాయంటున్న వ్యాపారులు
- సంతోషం వ్యక్తం చేస్తున్న విక్రయదారులు
Gold Rate | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్, డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు దూసుకెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో సామాన్య వినియోగదారులకు భారీ ఊరట లభించింది. గత రెండు, మూడు రోజుల్లోనే తులం బంగారం ధర వేలల్లో తగ్గడం విశేషం.
ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత, గత నాలుగైదు రోజులుగా పసిడి, వెండి ధరలు నేలచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ ఇవ్వగా, కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ పసిడి, సిల్వర్ ధరలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేడు గోల్డ్ రేట్స్ ఇలా..
శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,580 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,530 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.9,050 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900 వద్ద పలుకుతోంది.
నేటి వెండి ధరలు ఇలా..
శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,20,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద పలుకుతోంది.
