వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా డాలర్ విలువకు, బంగారం ధరలకు ముడిపడి ఉన్నాయి. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర (Price) తగ్గుతుంది. ఈరోజు పసిడి ధర తగ్గింది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోల్చితే వెయ్యి డాలర్ల ఇండియా కరెన్సీ విలువ రూ.88,635 లుగా ఉంది.
నిన్నటి నుంచి నిలకడగా ఉన్న బంగారం ధర.. ఈరోజు 11 గంటల సమయానికి అప్‌డేట్ అయ్యింది. తాజాగా తులం బంగారంపై రూ.330 తగ్గుముఖం పట్టింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో ధరలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ.1,25,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,15,200 వద్ద ఉంది.

అదే సమయంలో 18 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.94,280 వద్ద ఉంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఈ రోజు వెండి ధర పరుగులు తీసింది. కిలోకు రూ.2000 వరకు పెరిగింది. ఢిల్లీలో వెండి ధర కిలో రూ.1,62,000కి చేరుకుంది.
Price Drop | భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు
బెంగళూరు | 22K – రూ. 1,15,470.00 | 24K – రూ. 1,25,960.00
చెన్నై | 22K – రూ. 1,17,120.00 | 24K – రూ. 1,27,760.00
ఢిల్లీ | 22K – రూ. 1,15,640.00 | 24K – రూ. 1,26,110.00
కోల్‌కతా | 22K – రూ. 1,15,480.00 | 24K – రూ. 1,25,970.00
ముంబై | 22K – రూ. 1,15,500.00 | 24K – రూ. 1,25,990.00
పుణే | 22K – రూ. 1,15,520.00 | 24K – రూ. 1,26,010.00

