Gold medals | రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్….

Gold medals | రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్….

Gold medals | కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని త్రినేత్ర గార్డెన్ ఈనెల 8న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కుంఫు ఆల్ స్టైల్ లో (కటాస్ విభాగంలో) నిర్మల్ జిల్లా కడెం మండలం ఎంపీ యుపిఎస్ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు పాల్గొని గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్ సర్టిఫికెట్స్ సాధించారని పాఠశాల హెచ్ఎం కె వెంకటేశం తెలిపారు.

పాఠశాలకు చెందిన అజ్మీర నిహారిక అజ్మీరా సుశాంత్, ఇస్లవత్ నిక్షిత, బానవత్ శామ్, భూక్య సింధు, అజ్మీరా వంశారాణి, అజ్మీరా లిఖిత, బానవత్ కార్తీక్ గోల్డ్ మెడల్స్ సాధించారని ఆయన తెలిపారు. అలాగే పాఠశాలకు చెందిన భుక్య రిషిత్ సిల్వర్ మెడల్ సాధించారన్నారు. నాగవత రితిక్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు ఆయన చెప్పారు.

మెడల్స్ సాధించిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం కే వెంకటేష్ ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త ఉప సర్పంచ్ ఎన్ సరిత పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ సి ఆర్ పి ఎన్ సోలమన్ నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పోషకులు అభినందించారు. మెడల్స్ సాధించటానికి శిక్షణను ఇచ్చిన కరాటే మాస్టర్ మనోహర్ కు, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply