ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్

ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్
దమ్మపేట ,ఆంధ్రప్రభః ఖమ్మం సర్దార్ వల్లభాయి పటేల్ స్టేడియంలో సీఏం కప్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం లోహితశ్రీ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల రిజర్వ్ విభాగంలో తన గురి తప్పని అస్త్రాలతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన లోహితశ్రీ ,క్రమశిక్షణతో కూడిన సాధనతో రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించటం పట్ల క్రీడాకారులు , స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి పట్వారిగూడెం గ్రామం పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన లోహితశ్రీ ని దమ్మపేట మండల మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు ,దమ్మపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు ,బొల్లికొండ ప్రభాకర్ , రాయల నాగేశ్వరరావు పలువురు ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ , అంతర్జాతీయ పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
