Godavarikhani | ప్రమాదాల నియంత్రణకు చర్యలు

Godavarikhani | ప్రమాదాల నియంత్రణకు చర్యలు
ప్రమాద స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కసరత్తు
Godavarikhani | గోదావరిఖని, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (Amber Kishore Jha) పేర్కొన్నారు. ఈ రోజు రాజీవ్ రహదారిలో ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్ ఆర్ కే సంస్థ అధికారులతో కలిసి చర్యలు చేపట్టారు.
గోదావరిఖని (Godavarikhani) బి- గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ల డిజైన్, గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, రేడియం బ్లింకర్స్, స్టడ్స్, సిసి కెమెరాల ఏర్పాటు ప్రమాద స్థలాల గుర్తింపు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి, కారణాలపై సమీక్ష జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతంర సీపీ మాట్లాడుతూ… ప్రజల్లో భద్రతపై అవగాహన (security Awareness) తప్పనిసరిగా పెరగాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్య చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనరెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
