Godavarikhani | రామగుండంలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు

Godavarikhani | రామగుండంలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు

  • రూ.175.47 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • 1055 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
  • 53 మంది ట్రాన్స్ జెండర్స్‌కు పట్టాల అందజేత

Godavarikhani | గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గంలో ఈ రోజు 175.47 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.80.52 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదేవిధంగా రూ.88.90 కోట్లతో వివిధ ఏరియాలలో తాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులను చేపట్టనున్నారు.

6.5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు నిర్మాణం చేసేందుకు మంత్రులు శంకుస్థాపనలతో ప్రారంభించారు. అలాగే 479 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు పత్రాలను రాష్ట్ర మంత్రులు చేతులమీదుగా అందజేశారు. 576 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపించేశారు. గోదావరిఖనిలో జరిగిన భారీ బహిరంగ సభ వేదిక సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గం లోని 53 మంది ట్రాన్స్ జెండర్స్‌కు ఇళ్ల స్థలాల పట్టాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు హార్కార వేణుగోపాల్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర మినిమం వేజ్ చైర్మన్ జనప్రసాద్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు అరుణశ్రీ, సింగరేణి జిఎం లలిత్ కుమార్ సీనియర్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, యుగంధర్, కొలీపాక సుజాత, రాజిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply