TELANGANA | ఇంటింటికి వెళ్లి..

TELANGANA |ఇంటింటికి వెళ్లి..

ప్రభుత్వంపై ఆశీర్వాదం ఉండాలి
ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరలు అందించాలి
గత ప్రభుత్వం 0 వడ్డీ రుణాలు అందించలేదు
మంత్రి పొన్నం ప్రభాకర్

TELANGANA | చిగురుమామిడి, ఆంధ్రప్రభ : మహిళా సోదరీమణులందరికీ ఆశీస్సులు ప్రభుత్వం పై ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహిళలకు సారే పెట్టి చీరలు పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని 18 సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ సారే పెట్టి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇంటింటికి వెళ్ళి మహిళా సంఘాలు బొట్టు పెట్టి చీరలు అందించాలన్నారు. మహిళలందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందించలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు మహిళలకు వడ్డీలేని రుణాలు అందించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు, పెట్రోల్ బంకులు, బస్సులు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు.

నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు..
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంకి 3500 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఇంకా కట్టుకొని వారు కట్టుకోవాలి. తరువాత మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందుతోంది. నూతన రేషన్ కార్డులు వచ్చాయి. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply