Glorious history | కాకతీయ అపోలో విద్యాసంస్థల 40వసంతాల ఘ‌న‌ చ‌రిత్ర‌

Glorious history | కాకతీయ అపోలో విద్యాసంస్థల 40వసంతాల ఘ‌న‌ చ‌రిత్ర‌

  • నందిగామలో అజరామరంగా ‘మహోత్సవ్’ వేడుకలు..
  • విద్యా రంగంలో నాలుగు దశాబ్దాల గర్వకారణ ప్రయాణం.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Glorious history | నందిగామ, ఆంధ్రప్రభ : గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కాకతీయ అపోలో విద్యాసంస్థలు 40 సంవత్సరాల ఘన చరిత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా నందిగామలో నిర్వహించిన ‘మహోత్సవ్’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.

…ప్రజాసేవ – విద్య – సంస్కృతి రంగాల ప్రముఖుల సందడి…
ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్‌పర్సన్ పొడపడ తేజస్విని l, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కాకతీయ విద్యా సంస్థల అధినేతలు కాపా రవీంద్రనాథ్, భారతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Glorious history

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సాహసానికి ప్రతిరూపం అని, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి అని, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన నాయకుడిగా కొనియాడారు. గత ఐదేళ్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసి ధర్మం వైపు నిలబడ్డ తీరు స్ఫూర్తిదాయకమ‌ని పేర్కొన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సేవలు మరువలేనివి, నందిగామ అభివృద్ధికి కీలక భూమిక చిన్ని నందిగామకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణలో, ఎన్నో ఎత్తిపోతల పథకాలకు నిధులు సాధించడంలో ఆయన పాత్ర అమూల్యమని తెలిపారు. నందిగామ ప్రజల పట్ల ఆయనకున్న మమకారం అభివృద్ధికి ఊపిరి పోస్తోందన్నారు.

నా జీవితానికి పునాది..
కాకతీయ అపోలో తాను ఒక పూర్వ విద్యార్థినిగా భావోద్వేగంగా స్పందించిన ఎమ్మెల్యే సౌమ్య తాను ఎదగడానికి తొలి పునాది వేసింది కాకతీయ అపోలో సంస్థలే అని అన్నారు. 1986లో రవీంద్రనాథ్ ప్రారంభించిన ఈ సంస్థ, వేలాది మంది గ్రామీణ విద్యార్థుల జీవితాలను మార్చిందని, నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ స్కూల్ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గర్వంగా తెలిపారు.

క్రమశిక్షణ – నైతిక విలువలే నా బలం. స్కూల్ ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ, నైతిక విలువలే తన వ్యక్తిత్వ వికాసానికి కారణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా పోరాడగలిగానని, నేడు సౌమ్యతతో కూడిన పరిపాలన అందించగలుగుతున్నానంటే దానికి ఈ స్కూల్ స్ఫూర్తే మూలమన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఈ పాఠశాల తన గుండెల్లో నిలిచిపోతుందని చెప్పారు.

చదువు మార్కుల కోసం కాదు కలల కోసం ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి, చదువు అనేది కేవలం మార్కుల కోసమే కాకుండా మీ కలలను నిజం చేసే ఆయుధం అనితెలిపారు.విద్యార్థులపై తనకున్న ప్రేమకు నిదర్శనంగా,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నియోజకవర్గ టెన్త్ టాపర్లకు విమాన ప్రయాణం కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు గొప్పగా చదివి సంస్థకు, నందిగామకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరెన్నో తరాలకు వెలుగులు 40 ఏళ్ల ప్రయాణం ఇలాగే కొనసాగాలి.కాకతీయ అపోలో విద్యాసంస్థల 40 ఏళ్ల ఉజ్వల ప్రయాణం మరెన్నో దశాబ్దాలు కొనసాగాలని, మరెన్నో తరాలను తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ,ఈ వేడుకకు ఆహ్వానించిన రవీంద్రనాథ్ కి, యాజమాన్యానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక విద్యాసంస్థల అధినేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల కూటమి నేతలు, వివిధ హోదాల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Leave a Reply