Sarpanch | అభివృద్ధి చేసే అవకాశమివ్వాలి

Sarpanch | అభివృద్ధి చేసే అవకాశమివ్వాలి
Sarpanch | బిక్కనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir Ali) సహకారంతో అభివృద్ధి చేసే అవకాశమివ్వాలని బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాలగోని రాజా గౌడ్ కోరారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. తాను సొసైటీ చైర్మన్‌గా ఇప్పటికే రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం మరింత కల్పించాలని ఆయన సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని చెప్పారు.
