మరోసారి సర్పంచ్‌గా అవ‌కాశం క‌ల్పించండి..

  • ఇంటింటి ప్రచారంలో శిల్పా శ్రీనివాస్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలను శిల్పా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తనను మరోసారి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మిగిలిన అన్ని పనులను పూర్తి చేస్తానని తెలిపారు.

శనివారం తన భర్త, మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, ఇతర గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, తన ఉంగరం గుర్తును చూపించి ఓట్లు కోరారు. శిల్పా శ్రీనివాస్ రెడ్డి, తన భర్త చేసిన అభివృద్ధి పనులను కొనసాగిస్తూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని హామీ ఇచ్చారు.

తన ప్రకటనలో, గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పదవి ఉన్నా లేకున్నా మొదటినుండి పనిచేస్తున్నామని, ఇకముందు కూడా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కొనసాగిస్తామని చెప్పారు. ఉంగరం గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని, తనను భారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు, గ్రామస్తులు సౌహార్దంగా ఆమెని ఆదరించారు.

Leave a Reply