GIRLS | హాస్టల్‌లో మెడికల్ క్యాంప్
- విద్యార్థినులకు రక్త పరీక్షలు
GIRLS | పరకాల, జనవరి 5 (ఆంధ్రప్రభ): పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ రోజు పరకాల సబ్ సెంటర్ 2 పరిధిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో డాక్టర్ స్వాతి ఆదేశాల మేరకు డాక్టర్ వంశీ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉన్నవారికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్, సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సొంగ రజిత, ఆశాలు బీరెల్లి సౌందర్య, ఏకు నిర్మల, హాస్టల్ వార్డెన్ పోతరాజు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

