Gifted | రూ.కోటి విలువైన వెండి మండపం బహుకరణ

Gifted | మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజుల్లుతున్న కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి(Mopidevi Subrahmanyeshwara Swamy) వారికి దాతలు ప్రత్యేకంగా తయారు చేసిన వెండి మండపాన్ని బహూకరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి బంధువులు ఆర్.వి.ఆర్ చౌదరి – సౌభాగ్య లక్ష్మి దంపతులు 50కిలోల వెండి మండపాన్ని(50 kg silver mandapam) గురువారం స్వామి వారికి అందజేశారు.

రూ.1,01,53,742ల విలువ కలిగిన మండపాన్ని స్వామివారిపై ఉన్న భక్తితో తయారుచేసి సమర్పిస్తున్నట్లు దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, యువ నాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గం పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్(Kanaparthi Srinivas), యార్లగడ్డ సీతారామయ్య, కూటమి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శిoచుకున్నారు. స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు.

Leave a Reply