GHMC Headquarters | జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య..

GHMC Headquarters | జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య..

అధికారుల ఇబ్బందులు


GHMC Headquarters | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం (GHMC Headquarters) లో నీటి సమస్యతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏడవ అంతస్తు వరకూ నిన్న మధ్యాహ్నం నుంచి నీటి సమస్య తలెత్తింది. దీంతో అన్ని రకాలుగా అధికారులు, సిబ్బందితో పాటు సందర్శకులు అవస్థలు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన బిల్డింగ్ మెయింటేన్స్ (Building Maintenance) యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీటి సమస్య కారణంగా మధ్యాహ్న భోజనం కూడా చేయలేకపోయామని పలువురు సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply