Ghattuppal | తహశీల్దార్‌కు ఉత్తమ సేవ అవార్డు…

Ghattuppal | తహశీల్దార్‌కు ఉత్తమ సేవ అవార్డు…

Ghattuppal | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల తహశీల్దార్ రాములుకు మండలంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ సేవ అవార్డు ఈరోజు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అవార్డును అందజేశారు. ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన, భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తహశీల్దార్ రాములు మాట్లాడుతూ… ప్రజల సహకారం, సహచర అధికారుల మద్దతుతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తహశీల్దార్ అన్నారు.

Leave a Reply