Ghantasala | పంట రక్షణ చర్యలు చేపట్టాలి

Ghantasala | పంట రక్షణ చర్యలు చేపట్టాలి
- వ్యవసాయ శాస్త్రవేత్తలు
- మినుము పంటను క్షేత్ర సందర్శన
Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్‌జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల శాస్త్రవేత్తల బృందం స్థానిక ఘంటశాల మండలం ఘంటశాలపాలెం, కొత్తపల్లి గ్రామాలలో మినుము పంటను క్షేత్ర సందర్శన చేశారు. కేవికే సమన్వయ కర్త డా.డి.సుధారాణి మినుము సాగులో కాండం గజ్జి తెగులు యాజమాన్యం గురించి రైతులకు వివరించారు.
ప్రస్తుత కాలంలో మినుము మొక్కలు 20 రోజుల వయస్సు నుండి చనిపోతున్నాయని, నీటి తడులు ఇచ్చిన తర్వాత మొక్కలు చనిపోవడం ఇంకా ఎక్కువ అవుతుందని, యాజమాన్యం కొరకు మెటలాక్సిల్ + మాంకోజెబ్ మందును 400 గ్రా. ఎకరానికి చొప్పున పిచికారీ రూపంలో కాకుండా నేలను తడిచేలా చూసుకోవాలని తెలిపారు. పొగాకు లద్దె పురుగు యాజమాన్యం కోసం నొవల్యూరాన్ మందును ఎకరానికి 200 మి.లీ. చొప్పున పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రేవతి, మండల వ్యవసాయ అధికారి అనూష, వీఏఏ అహ్మద్, రైతులు పాల్గొన్నారు.
