ఘ‌నంగా ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం..

ఘ‌నంగా ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఇండ్లులేని నిరుపేదలందరికీ ఇండ్లు కట్టి ఇవ్వడానికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం (Koyalagudem) గ్రామంలో చేపట్టిన 27 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో నామని జయమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గ్రూప్ అండ్ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వీరబాయితో కలిసి ఈ రోజు మార్కెట్ చైర్మన్ నూతన ఇంటిని ప్రారంభించారు.

నూతన గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ వ్రతం(Satyanarayana Vratam)లో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ వీరాబాయి మాట్లాడుతూ లబ్ధిదారులందరూ వేగవంతంగా పూర్తి చేసుకుని నూతన గృహా ప్రవేశాలు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి(Akula Indrasena Reddy), మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, కోయ్యలగూడెం పంచాయతీ కార్యదర్శి మారం జలంధర్ రెడ్డి, నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ దేవేందర్, ఎర్రగుంట వెంకటేశం, మాచర్ల సంతోష్ కుమార్(Macharla Santosh Kumar), గుర్రం సత్తిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, గుర్రం రాఘవేంద్ర, ఏలే మురళి తదితరులు పాల్గొన్నారు. కాగా నూతన గృహప్రవేశానికి వచ్చిన అతిథులను ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు నామని జయమ్మ దంపతులు శాలువాలు కప్పి సన్మానించారు.

Leave a Reply