జియో-బిపి కొత్త మైలురాయి..

  • 28 సూపర్‌ఫాస్ట్ EV ఛార్జర్లు ఒకే చోట

భారతదేశంలో తొలి, అతిపెద్ద సమీకృత ఎలక్ట్రిక్ వాహన (EV) మొబిలిటీ సెంటర్‌ను జియో-బిపి బెంగళూరులోని దేవనహళ్లిలో ప్రారంభించింది. దేశంలోనే అత్యధికంగా 28 సూపర్‌ఫాస్ట్ DC ఛార్జింగ్ పాయింట్‌లను కలిగి ఉన్న ఈ కేంద్రం, పరిశుభ్రమైన, స్మార్ట్, సుస్థిర ప్రయాణానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది.

దేవనహళ్లిలోని ఈ విశాల కేంద్రం ఒక మల్టీ-ఫ్యూయల్ రిటైల్ అవుట్‌లెట్గా పనిచేస్తుంది. ఇది పెట్రోలు, డీజిల్, CNG, EV ఛార్జింగ్ సదుపాయాలతో పాటు వైల్డ్ బీన్ కేఫ్‌ను కూడా ఒకే చోట అందిస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక 360kW సామర్థ్యం గల వేగవంతమైన DC ఛార్జర్‌లు కస్టమర్లకు సమగ్రమైన, నాణ్యమైన సేవలను అందిస్తాయి.

జియో-బిపి ఛైర్మన్ సార్థక్ బెహూరియా ఈ కేంద్రాన్ని “భారతదేశంలో సమీకృత ప్రయాణానికి కొత్త దిశ”గా అభివర్ణించారు. ఆధునిక EV టెక్నాలజీని రిటైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తక్కువ కార్బన్ రవాణా దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న ఈ స్టేషన్ ప్రైవేట్, వాణిజ్య EV వినియోగదారులకు వేగవంతమైన ఛార్జింగ్ సేవలను అందిస్తుంది. వాహనం ఛార్జ్ అయ్యేంతలో కస్టమర్లు కాఫీ తాగుతూ, విశ్రాంతి తీసుకునే సౌకర్యం ఇక్కడ ఉంది. ఇంధనం భర్తీ, షాపింగ్, కేఫ్ ఒకే చోట లభిస్తాయి.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వేదిక విస్తృత శ్రేణి EV మోడల్స్‌కు అనుకూలంగా ఉండి, వేగంగా పెరుగుతున్న భారతీయ EV మార్కెట్‌కు బలం చేకూరుస్తుంది.

సుస్థిరత, సమీకృత రవాణాలో తన నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, ఈ దేవనహళ్లి సెంటర్ “వేగం, నమ్మకం, సౌకర్యం” అనే మూడు విలువలతో EV యజమానుల “రేంజ్ ఆందోళన” (Range Anxiety)ను తగ్గించబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ఆపరేషనల్ సైట్‌లను నిర్వహిస్తున్న జియో-బిపి, త్వరలోనే 1,000 లొకేషన్లలో 7,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. 480kW వరకు సామర్థ్యం గల ఛార్జర్లు, 96 శాతం పైగా అప్‌టైమ్, ప్రీమియం కేఫ్‌లు, విశ్రాంతి జోన్‌ల వంటి సదుపాయాలతో జియో-బిపి EV వినియోగదారులకు కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది.

Leave a Reply