General | మెరుగైన వైద్య సేవ‌లు…

General | మెరుగైన వైద్య సేవ‌లు…

General | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళం (రిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, ఆసుపత్రిలో పరిశుభ్రత ప్రమాణాలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరిశీలనలో భాగంగా ఆసుపత్రి వాష్‌రూమ్‌లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే, కొన్ని టాప్స్ విరిగిపోయి ఉండటాన్ని గమనించారు.

దీంతో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి, వాటిని అత్యవసరంగా మరమ్మతు చేయించాలని ఆదేశించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మెడికల్ స్టోరేజ్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా జనరల్ వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు ఒకే చోట ఉండటాన్ని గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, స్వయంగా వెళ్లి వ్యర్థాలను వేరుచేసి బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.

General |

ఆసుపత్రిలో వ్యర్థాల నిర్వహణ విధానం నిబంధనల ప్రకారం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. బార్కోడ్ విధానం సక్రమంగా అమలు కావడం లేదని గమనించిన ఎమ్మెల్యే, ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేదల కోసం పనిచేసే ముఖ్యమైన వైద్య కేంద్రం అని, అలాంటి ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, వార్డు ఇంచార్జ్ కెవిఎస్ గుజ్జి నాయుడు, ఏపీ ఎంఎస్ ఎం డైరెక్టర్ ప్రధాన విజయరం, క్లస్టర్ ఇంచార్జ్ అందవరపు సంతోష్, టి ఎన్ ఎస్ ఎఫ్ లీడర్ రెడ్డి గిరిజ శంకర్, టిడిపి టౌన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జ్యోతి భాస్కర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply