Geetha | గ్రామాభివృద్ధికి కృషి చేస్తా
- శ్రీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూచుకుల్ల
- గీత నరసింహారెడ్డి
Geetha | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నాగర్ కర్నూల్ జిల్లా ఎమ్మెల్సీ కూచికుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూచుకుల్ల గీత నరసింహారెడ్డి చెప్పారు. తమ కుటుంబం గత 35ఏళ్లుగా శ్రీపురం గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉందని, నేను ఎంపీటీసీగా ఒకసారి పని చేశానని, తన భర్త నరసింహారెడ్డి కూడా ఒక పర్యాయం ఎంపీటీసీగా పనిచేసే ప్రజల అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశామని ఆమె తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సహకారంతో గ్రామంలో మూడు కోట్ల నిధులతో సీసీ రోడ్లు వేయించామని, ఒక సబ్ స్టేషన్ తెచ్చామని, విద్యుత్తు స్టోర్ జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆమె వివరించారు. రైతులకు అవసరమయ్యే ఎరువుల నిల్వల కోసం సింగిల్ విండో కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో కూడా ప్రజల కోసం పనిచేస్తామని తామే గెలుస్తామని ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

