పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి…

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి…

  • తాసిల్దార్ కు వినతి పత్రం అంద‌జేత‌…

చిట్యాల, ఆంధ్రప్రభ : సామాన్య ప్రజలపై పెంచిన వంట గ్యాస్ దరలు తక్షణమే తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య డిమాండ్ చేశారు.మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో గ్యాస్ ధరలు తగ్గించాలని తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ కి వినతిపత్రం అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని మల్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి దూడపాక సాంబయ్య, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి పుల్ల అశోక్, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు , పాల్గొన్నారు.

Leave a Reply