అనకాపల్లి : పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోనీ (Pharma city) ఎస్ ఎస్ ఫార్మాస్కూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీకై (Gas leakage) ఇద్దరు మృతి చెందారు . ఒకరి పరిస్థితి విషమంగా ఉంది .
మృతులు పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్, బైడు బైసల్ అను వ్యక్తి చికిత్పొందుతున్నాడు–1. పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ) 2. సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి) గా గుర్తించారు.హెల్పేర్ బైడూ భైసాల్ తీవ్ర అశ్వతతకు గురయ్యాడు చనిపోయిన ఇద్దరు దేహాలను కేజీ మార్చురీకి తరలించారు. .
కాగా,ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు గతంలో కూడా ప్రమాదం జరిగిందని భద్రతా ప్రమాణాలు వైఫల్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని గని శెట్టి అన్నారు. మృతులు కుటుంబాల కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని గని శెట్టి డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గని శెట్టి హెచ్చరించారు