హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు…

హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు…

36 సిలిండర్లు పట్టివేత

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేటలో హోటళ్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి 36 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో గ్యాస్ సరఫరాలపై దీని ప్రభావం తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం వున్న నేపథ్యంలో గ్యాస్ పొదుపు గా వాడాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, అడ్డగోలుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 36 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి దమ్మపేట లోని చిలకల గండి ముత్యాలమ్మ తల్లి గ్యాస్ గోడౌన్ కు తరలించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార సముదాయాలు (హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్) కు వాడుతున్న వారిపై నిత్యావసర వస్తువుల చట్టం సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీలు ప్రభాకర్, శివకుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply