Gas cylinders | వారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంపు

Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కూలీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచాలని నిర్ణయించింది.

వలస కూలీలకు తక్కువ ధరలో గ్యాస్ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రంలో 5 కిలోల గ్యాస్ సిలిండర్ల రోజువారీ కోటాను రెట్టింపు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సిలిండర్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో జరుగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలకు మాత్రమే ఈ 5 కిలోల సిలిండర్లు అందించాలనే మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల వలస కూలీలకు గ్యాస్ అందుబాటులో ఉంచడంతో పాటు, వారి దైనందిన అవసరాలకు ఉపశమనం కలిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply