Gannavaram Former MLA | వల్లభనేని వంశీ కోసం…

Gannavaram Former MLA | వల్లభనేని వంశీ కోసం…
పోలీసుల జల్లెడ…
Gannavaram Former MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గన్నవరం మాజీ ఎమ్మెల్యే (Gannavaram Former MLA), వైఎస్సార్‌సీపీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కీలక ఆధారాలు లభ్యమవడంతో డిసెంబర్ 17న మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదు (case Registration ) చేశారు.
సునీల్ (Sunil) పై దాడి ఘటనకు సంబంధించి మొదటి నుంచే వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో లభించిన ఆధారాలతో మరింత తీవ్రమైన అభియోగాలు నమోదు చేసినట్లు మాచవరం పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వంశీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన రాజకీయంగా మరిన్ని చర్చలకు దారితీస్తోంది.
ఈ కేసు నమోదు తర్వాత నుంచి వల్లభనేని వంశీ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీపై కేసు నమోదు కావడం, వెంటనే ఆయన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ (political circles Tension) ను పెంచుతోంది. గతంలోనూ వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
