Gaddar Awards | నేడే గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం …

హైద‌రాబాద్ – తెలంగాణ(Telangana ) రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా (Cinema) అవార్డుల (Awards ) ప్రదానానికి కొత్త ఊపిరినిచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ప్రభుత్వం గద్దర్ (Gaddar ) పేరిట అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ చలనచిత్ర రంగానికి గుర్తింపు కల్పిస్తూ, 2024లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులు ప్రకటించగా, గత పదేళ్లలో వచ్చిన చిత్రాల నుంచి ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలకూ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే అవార్డు విజేతలను జ్యూరి సభ్యులు ప్రకటించారు.. ఇక‌ ఈ అవార్డుల ప్రదానోత్సవం నేటి సాయంత్రం హైటెక్స్ వేదికగా జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) , సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy ) దితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.


గ‌ద్దర్ అవార్డు విజేతల వీళ్లే..
ఉత్తమ చిత్రం: కల్కి, లక్కీ భాస్కర్, పొట్టేల్
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
ఉత్తమ సామాజిక చిత్రం: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్: రజాకార్
ఉత్తమ నూతన దర్శకుడు: ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్: ఆయ్
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట ఫేమ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ (రజాకార్)
ఉత్తమ గాయకుడు: సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
ఉత్తమ బాల నటులు: అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ హాస్యనటులు: వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పాటల రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామీ)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్): ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
ఉత్తమ కళా దర్శకుడు: అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ (గామీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *