Gachibowli | గచ్చిబౌలిలో హై టెన్షన్

Gachibowli | గచ్చిబౌలిలో హై టెన్షన్
Gachibowli | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని గచ్చిబౌలి (Gachibowli) లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ స్టార్ హోటల్‌పై 50మంది దాడి (50 people attacked) చేశారు. గచ్చిబౌలిలోని హోటల్ థార్ తంగరిన్ (Hotel Thar Tangerine)పై ఇవాళ ఉదయం కొంతమంది దాడి చేశారు. హోటల్లోకి చొరబడి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
హోటల్ లో బసచేసిన అతిథులను బలవంతంగా గదుల నుంచి ఖాళీ చేయించారు. దీంతో వారు ప్రాణభయంతో రోడ్డుపైకి వెళ్లారు. లీజుదారుడికి, బిల్డింగ్ యజమానికి మధ్య వివాదమే దాడికి కారణమని ప్రచారం జరుగుతోంది. హోటల్ సిబ్బంది (Hotel Staff)పై సైతం దాడి చేశారు. దాడిపై హోటల్ నిర్వాహకులు (Hotel Management) ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు గడువు అయిపోతే కోర్టులో తేల్చుకోవాలి.. ఇలా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.

