30వ వార్డు కౌన్సిల‌ర్‌గా జి.మ‌నీష ఘ‌న విజ‌యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.మనీష ఘ‌న విజ‌యం సాధించారు. శుక్ర‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల హ‌వా కొన‌సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి అభివృద్ధికి ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొన్నారు. అన్నివ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌ని ప్ర‌జ‌లు నిరూపించార‌ని అన్నారు. ఈ విజ‌యం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మ‌రింత బాధ్య‌త‌ను తెచ్చిపెట్టింద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, త‌న తండ్రి వెంకటరాజుతో క‌లిసి విజ‌య ద‌ర‌హాసం ప్ర‌ద‌ర్శించారు.

Leave a Reply