Funds | పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం…

Funds | పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం…
Funds | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో కేటాయించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆహ్వానించడం జరిగిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు శనివారం డిప్యూటీ అసెంబ్లీ చాంబర్లో కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి ఆహ్వానం ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి వివరించడం జరిగింది.
అదేవిధంగా కొణిదెల అభివృద్ధికి సొంత నిధులతో మీరు మంజూరు చేసిన రూ.50 లక్షల నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్హెడ్ నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయింది అని పవన్ కళ్యాణ్ కి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి పవన్ కళ్యాణ్ కి వివరిస్తూ కొణిదెల గ్రామానికి ‘పల్లె పండుగ 1.0’లో రూ.20 లక్షలకు పైగా వెచ్చించి 3 అంతర్గత రోడ్లు పల్లె పండుగ 2.0’లో రూ.45 లక్షలతో చేపట్టిన 7 సీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి వివరించడం జరిగింది.

జిల్లా పరిషత్తు స్కూలు నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, పంచాయతీ రాజ్ నిధులు రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే విన్నపించుకోవడం జరిగింది అని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ సంబంధించిన చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురయ్యాయి అని పేర్కొన్నారు.
Funds | రోడ్లన్నీ దెబ్బతిన్నాయి
కనీసం రోడ్ల మరమ్మత్తు పనులు కూడా గత ప్రభుత్వం చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి అని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చినాక అనేక గ్రామాలలో వర్షాలకు నష్టపోయిన రోడ్లను నిర్మించడం జరిగిందని ఇంకా కొంత మేరకు నియోజవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్ల మరమ్మతుకు కొత్త రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోరడం జరిగింది.
కొత్తపల్లి మండలం శివపురం గ్రామం నల్లమల్ల ఫారెస్ట్ పరిధిలో వెలిసినటువంటి కొలనుభారతి సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళుటకు బీటీ రోడ్డుకు మరియు విద్యుత్ సౌకర్యానికి మరియు జూపాడు బంగ్లా మండలం పారమంచాల గ్రామం నుంచి మిడ్తూర్ మండలం బరక సంజరాయుడు వరకు గతంలోనే అనుమతి ఇచ్చిన బీటి రోడ్డుకు ఫారెస్ట్ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారు మానవత్వ దృక్పథంతో మా నియోజకవర్గంలో ఉన్న గుళ్ళు కు రహదారులకు నిర్మించుటకు సహకరించవలసిందిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని అన్నారు.
ప్రతి సమస్యను సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నందికొట్కూరు నియోజకవర్గం సమస్యలపై, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు. ముఖ్యంగా నిధుల మంజూరు రోడ్డు పనులు, స్థానిక సమస్యలపై త్వరలోనే చర్యలు చేపడతామని స్వయంగా కొణిదెల గ్రామాన్ని సందర్శిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గం సమస్యల పైన స్పానుకులంగా స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..
CLICK HERE TO READ MORE : ఇద్దరు అభ్యర్థుల ప్రతిభ..
కనీసం రోడ్ల మరమ్మత్తు పనులు కూడా గత ప్రభుత్వం చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి అని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చినాక అనేక గ్రామాలలో వర్షాలకు నష్టపోయిన రోడ్లను నిర్మించడం జరిగిందని ఇంకా కొంత మేరకు నియోజవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్ల మరమ్మతుకు కొత్త రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య కోరడం జరిగింది.
