మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి…

మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి…
పట్టణాలకుదీటుగా గ్రామాల అభివృద్ధికికృషి.
కేంద్ర ప్రభుత్వపథకాలుప్రజలకు వివరించండి.
పల్లె దవాఖాన, రహదారి నిర్మాణానికి నిధులుమంజూరు.
కేంద్రప్రభుత్వ నిధులతోనే గ్రామాలఅభివృద్ధి.
పాలమూరుపార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి సాధ్యమని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమన్నారు. పల్లెల ప్రగతికి ప్రత్యేక కృషి చేసి పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రంలో ఎంపీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డు, హైమాక్స్ లైట్లు ప్రారంభించారు.
ఎంపీడీకే అరుణకు ప్రజలు బిజెపి శ్రేణులు డప్పు మేళతాళాలతో ఘనంగా స్వాగతంపలికారు. అనంతరం పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎంపీడీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాననిఅన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తాననిఅన్నారు. వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారనిగుర్తుచేశారు.
ప్రతి పల్లె అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందజేస్తాం అని వెల్లడించారు. ప్రజల మద్దతుతో గెలుపొందిన బిజెపి సర్పంచ్ లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండిసమస్యలు పరిష్కరించాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నాయకులు, కార్యకర్తలు అర్హులైన పేద ప్రజలకు అందే విధంగా చూడాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే నాయకులకర్తవ్యంఅన్నారు.
అనంతరం పెద్ద జట్రం నుండి లక్ష్మీ పల్లికి లింకు రోడ్డు, పల్లె దవఖాన, అంగన్వాడి భవనం నిర్మించాలని జి పి పాలకవర్గం సభ్యులు ఎంపీడీకే అరుణకు వినతి పత్రం సమర్పించారు. ఊట్కూర్ మండల కేంద్రానికి బిజ్వార్ మీదుగా వెళ్లేందుకు చాలా దూరమవుతుందని, లక్ష్మీ పల్లి లింక్ రోడ్డు పనులు చేపడితే కేవలం ఏడు కిలోమీటర్ల ప్రయాణంతో ఊట్కూర్ మండల కేంద్రానికి వెళ్తామని ఎంపీకి వివరించారు. అందుకు స్పందించిన ఎంపీడీకే అరుణ లక్ష్మీ పల్లి లింకు రోడ్డు పల్లె దవాఖాన అంగన్వాడి భవనానికి నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యా యాదవ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగు పాండు రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, సర్పంచ్ లు వాకిటి వెంకటేష్, అంజయ్య, తిరుమలేష్, ఉప సర్పంచులు స్వాతి పవన్ కుమార్, రమేష్,మాజీ మండల అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపిటిసి కిరణ్ కుమార్, బిజెపి నాయకులు సోమేశ్వర్ రెడ్డి శంకరప్ప జయపాల్ రెడ్డి గౌరీ శంకర్ రమేష్ కుమ్మరి శివ, తదితరులు పాల్గొన్నారు.
