funds | సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్

funds | సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్

funds | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: గిరిజన ఆరాధ్య దైవం సంత్‌శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి నిధులను వెంటనే విడుదల చేయాలని ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం భీమ్‌గల్‌ మండల్ అధ్యక్షుడు బాదవత్‌ శర్మనాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్‌ తుక్కాజీ నాయక్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడారు.గత సంవత్సరం భీమ్‌గల్‌లో అధికారులు అధికారికంగా నిర్వహించిన జయంతి ఉత్సవాల ఖర్చులను తమతో పెట్టించారన్నారు.అట్టి డబ్బులు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని వాపోయారు. గత ప్రభుత్వం 2015 నుంచి 2023 వరకు సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించి, డబ్బులు విడుదల చేసిందన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది నిధులను రూ. 2 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేసిందని తెలిపారు.కానీ ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాలేదన్నారు.ఈ సంవత్సరం కూడా అధికారికంగా జరుపుకుందామని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జయంతి వేడుకల ఖర్చు తమతో పెట్టించి ఇంకా ఇవ్వకపోవడం బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్‌ను అవమానించినట్లేని భావిస్తున్నామన్నారు. గతేడాది, ప్రస్తుత ఏడాది నిధులు ఈనెల 21 లోగా విడుదల చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ధరావత్‌ లింగం నాయక్‌,పట్టణ అధ్యక్షులు మాలవత్‌ మంగ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply