స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం

స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లు నిండిపోయి, సర్వదర్శనానికి చాలా సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ రద్దీ కారణంగా, శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం రోజున 72,473 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, 23,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా రూ.4.35 కోట్లుగా నమోదైంది.

Leave a Reply