పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి

పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి

దండేపల్లి, ఆంధ్రప్రభ : రెండవ అన్నవరంగా పేరు గాంచిన జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి(Sri Rama Sahitya Satyanarayana Swamy) ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ రోజు ఆలయ ఈ.ఓ. శ్రీనివాస్ తో కలిసి సత్యనారాయణ స్వామిని దర్శించుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్ల‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా ఆలయానికి దాదాపు 1 లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు బందోబస్తు, త్రాగునీరు, భారీకేడ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

భక్తులకు అవసరమైన పూజా స్థలం, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో గల జిల్లా పరిషత్(Zilla Parishad) ఉన్నత పాఠశాల పరిధిలో చేపట్టిన షెడ్యూల్డ్ తెగల(Scheduled Tribes) సంక్షేమ వసతి గృహ భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, పరిసరాలను పరిశీలించారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాలలో(School) పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉన్నందున విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply