from25thFeb | తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

from25thFeb | తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

from25thFeb | ఈ నెల 25 నుంచి ప్రారంభం
ప‌రీక్ష రాయ‌నున్న 9,97,075 మంది విద్యార్థులు
1,495 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

from25thFeb | ప‌రీక్ష‌ల కాలం మొద‌లైంది. ఎగ్జామ్స్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ.. విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. స‌రైన మార్కులు వస్తాయో లేదో అని భయపడుతుంటారు. ఇలాంటి సమయంలో విద్యార్థులు ధైర్యంగా ఉండాలి. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సత్ఫలితాలు వ‌స్తాయి. పరీక్షల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప‌రీక్ష‌లు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారు. అలాగే ప‌రీక్ష‌కు వెళ్లే ముందు ఈ కింది జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌భ సూచిస్తోంది.

from25thFeb
from25thFeb

  • ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్‌టికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
  • హాల్‌టికెట్‌తోపాటుగా తమ కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి.
  • విద్యార్థుల సౌకర్యం కోసం హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.
  • వీటిని ప్రింట్ తీసుకుని వెళ్లవచ్చు.
  • అలాగే పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
  • విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
  • తొలిరోజు కావున గంట ముందుగా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
  • విద్యార్ధులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి.
  • ప‌రీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు.
  • పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి.
  • మాల్‌ ప్రాక్ట్రీస్‌, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్‌ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.
  • ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

-ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్

Leave a Reply