Free medical | రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

Free medical | రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
Free medical | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని రాచపూర్ గ్రామంలో లక్ష్మణచాంద సాయి బాబా మెడికల్ డాక్టర్ వీణ, నూతన సర్పంచ్ బూసి ముత్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పరీక్షలు చేసి అవసరం అయిన వారికి తగిన మందులు అందించారు.
మొత్తం 60 మందికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోశెట్టి, వార్డు సభ్యులు, సాయి బాబా మెడికల్ యాజమాన్యం, గ్రామస్థులు పాల్గొన్నారు.
