పశువులకు ఉచిత వైద్య శిబిరం..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గుంటూరుపల్లిలో జిల్లాపశు గణాభివృద్ధిసంస్థ ,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారంఉచితగర్భకోశావ్యాధుల చికిత్స శిబిరం, నిర్వహించారు . ఈ శిబిరంకు ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ గుంటిపల్లి నాగమల్లేశ్వరావు, (చిన్ని) ఉప సర్పంచ్ ముద్దన నాగరాజు హాజరై ప్రారంబించారు. ఈ శిబిరానికి చిట్యాల పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్. జి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ పుట్టిన ప్రతి దూడకు గంటలోపు జున్ను పాలు తాగించలని, రోగనిరోధకశక్తిపెరుగుతుందన్నారు.

రైతులు, గోపాలమిత్ర సేవలువినియోగించుకోవాలని కోరారు . చల్లగరిగ పశువైద్య అధికారి డాక్టర్అ ప్పని అజయ్ మాట్లాడుతూ దూడ పుట్టిన 24 గంటల లోపల టీటీ ఇంజక్షన్ వేయించుకోవడం వలన ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు అన్నారు, ప్రతి రైతు 10 గుంటల భూమిలో పచ్చగడ్డి వేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 52పశువులను పరీక్షించి ఉచితంగామందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో గోపాలమిత్ర సూపర్వైజర్ , ప్రకాష్ రెడ్డి, ఎల్ ఎ సి, దివ్య,, పశు వైద్య సిబ్బంది, సుజాత, కర్ణాకర్,గోపాలమిత్రులు,సూర లక్ష్మణ్, వార్డు సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.

Leave a Reply