మాడుగులపల్లిలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం

మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సంస్కృతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రసూతి, స్త్రీరోగ నిపుణులు డాక్టర్ డి. సంస్కృతి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని శుభ ఫెర్టిలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సి. స్రవంతి రెడ్డి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివాహం అయి సంతానం లేని దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని నిరంతరం సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులు ఈ ఉచిత శిబిరాన్ని ఉపయోగించుకుని వైద్య సేవలు పొందాలని కోరారు.
