Frauds | 60మందికి రూ.1.85 కోట్ల టోకరా….

Frauds | 60మందికి రూ.1.85 కోట్ల టోకరా….

Frauds | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : తెలంగాణలో ఉద్యోగాల పేరుతో మోసాలు మరోసారి బయటపడుతున్నాయి. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని దుండగులు భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.

సూర్యాపేట జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దుండగులు సుమారు 60 మందిని నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.1.85 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురామ్, ఉద్యోగి వాణిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply