Foxo case | ప్రేమ పేరుతో మోసం..

Foxo case | ప్రేమ పేరుతో మోసం..

Foxo case, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో తీవ్ర కలకలం రేపిన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన పాలసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించిన దినేష్ ఆమెను గర్భవతిని చేసినట్లు విచారణలో తేలింది. ఇటీవల బాలిక శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆమెను వైద్య పరీక్షలకు తరలించగా, గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలికను నిలదీయగా, దినేష్‌తో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు పాలసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ కేసును సయ్యద్ మహమ్మద్ అజిజ్ ఆధ్వర్యంలో హనుమంతప్ప విచారించారు. క్రైమ్ నెంబర్ 57/2025గా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడు దినేష్‌ను అరెస్టు చేసిన రాజశేఖర్ అతడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply