భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : భూపాలపల్లి (Bhupalpally) జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలుషిత నీటికి కారణమైన నలుగురు టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం పాఠశాల‌లో క‌లుషిత నీరు తాగి 11మంది అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి విదిత‌మే. అయితే ఉపాధ్యాయుల్లో ఉన్న వ‌ర్గవిభేదాల వ‌ల్లే నీటిలో విష‌తుల్యం క‌ల్పిన‌ట్లు ప్రాథ‌మికంగా అధికారుల‌కు స‌మాచారం అందింది.

దీంతో శాఖ ప‌ర‌మైన ద‌ర్యాప్తు చేసి నీటిలో పురుగుల మందు (Pesticide) కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు, సూర్య ప్రకాష్, వంట మనిషి రాజేశ్వరి ని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ శ‌ర్మ ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు (Police cases) నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు (Teachers), ప్రిన్సిపాల్ (Principal) అంతర్గత విభేదాల‌తో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply