మేడారానికి రేపు నలుగురు మంత్రులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మేడారం మహాజాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు రాష్ట్ర మంత్రులు రేపు బుధవారం మేడారం వెళ్ల‌నున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖలు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మేడారం చేరుకోనున్నారు.

మహాజాతర ఏర్పాట్లలో భాగంగా జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కానున్నారు.

మంత్రుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విభాగాల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply