LABOR| నాలుగు లేబర్ కోడ్స్ విరమించుకోవాలి..

LABOR| నాలుగు లేబర్ కోడ్స్ విరమించుకోవాలి..
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్
LABOR| సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కార్మికుల హక్కులను హరించే కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని ఐడీఏ పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులను బానిసలుగా మారుస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి లేబర్ కోడ్స్ కాదని, యాజమాన్యాలను ప్రయోజనాలు కాపాడే కోడ్స్ అని అభివర్ణించారు. శనివారం ఐడీఏ పాశమైలారం బీపీఎల్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కాఫీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ సీఐటీయూ నాయకులు రాజు, తలారి శ్రీనివాస్, వెంకటేష్, సుధాకర్, జైపాల్, శేఖర్ రెడ్డి, ప్రవీణ్, శ్రీనివాస్, నాగరాజు, నవీన్, సాగర్, చంద్రకాంత్, ప్రభు, ఆనంద్, శ్రీకాంత్, భూపాల్, వివిధ పరిశ్రమ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
