పోచంపాడ్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు

బాల్కొండ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో దండుగుల రిషిక్ (20) అనే యువకుని హత్యకేసులో ఐదుగురుపై కేసును నమోదు చేయగా శుక్రవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం బాల్కొండ పోలీస్ స్టేషన్ లోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు.
దండగుల రిషిక్ పై వేముల నర్సింలు,వేముల ఉదయ్ కిరణ్,వేముల కిషోర్,కోట అరవింద్,అలకుంట చందు లు కర్రలు,కత్తితో దాడి చేసి గాయపరచగా రిషిక్ కు తీవ్ర గాయాలకు గురి కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 6వ తేదీన పాత కక్షలు, అనుమానం,డబ్బుల విషయమై ఘర్షణ జరిగిందని సిఐ పేర్కొన్నారు.ఈ కేసులో వేముల నర్సింలు,వేముల ఉదయ్ కిరణ్ లను గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు.
ఈ కేసులో వేముల నర్సింలు రిషిక్ ను కత్తితో పొడవుగా మిగతావారు దాడికి చేసి కొట్టారని తెలిపారు.ఈ కేసులో వేముల నర్సింలు,వేముల ఉదయ్ కిరణ్, అలకుంట చందు,అరవింద్ లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వేముల కిషోర్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు. దాడికి ఉపయోగించిన కత్తితో పాటు కర్రలు, రక్తం మరకలతో ఉన్న షర్టు, పల్సర్ వాహనం తో పాటు ఎర్టిగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.వేముల నర్సింలు, దండగుల వేణుగోపాల్ కుటుంబాల మధ్య ఈనెల ఆరో తేదీన ఘర్షణ జరగగా తీవ్ర గాయాలకు గురైన రిషిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడో తేదిన తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మెండోరా ఎస్సై సుహాసిని, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
