లంబాడి పేటలో ‘జీసస్ ఫైర్ పవర్ మినిస్ట్రీస్

లంబాడి పేటలో ‘జీసస్ ఫైర్ పవర్ మినిస్ట్రీస్
చర్చి శంకుస్థాపన చేసిన బుద్ధా వెంకన్న
విజయవాడ, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ పరిధిలోని లంబాడి పేటలో ‘జీసస్ ఫైర్ పవర్ మినిస్ట్రీస్’ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర బీసీ నాయకుడు గుర్రం వెంకటేశ్వరరావు (కొండ) పాల్గొని కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిలిపారు.
ప్రార్థనల నడుమ నిర్వహించిన ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. చర్చి ఫాదర్ బుడుగు తిమోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 47వ డివిజన్ అధ్యక్షులు నాగోటి రామారావు, 46వ డివిజన్ అధ్యక్షులు పోతినేడి లోకేష్, ప్రధాన కార్యదర్శి ధనాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

పీతల హరిబాబు, షేక్ సాదిక్, గుర్రం బుడ్డి, షేక్ బాజీ, ఉప్పుడి రాము సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చర్చి నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. లంబాడి పేట ప్రాంతంలో చర్చి నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానికులకు ప్రార్థనలు, సామాజిక కార్యక్రమాలకు ఒక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు తెలిపారు.

